అహ్మదాబాద్: పొట్టి ప్రపంచకప్‌లో టైటిలే లక్ష్యంగా ఆడుతున్న దక్షిణాఫ్రికా అపజయమన్నదే లేకుండా సాగుతున్నది. గ్రూప్-1లో భాగంగా అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఆ జట్టు.. 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 177 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా సారథి ఎయిడెన్ మార్క్మ్ (46 బంతుల్లో 82 నాటౌట్, 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు క్వింటన్ డికాక్ (24 బంతుల్లో 47, 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రియాన్ రికెల్టన్ (28 బంతుల్లో 45, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో 16.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు.. లుంగి ఎంగిడి (3/30), రబాడా (2/22), బాష్ (2/31) ధాటికి 83 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయినా లోయరార్డర్లో రొమారియా షెఫర్డ్ (37 బంతుల్లో 52 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), జేసన్ హోల్డర్ (31 బంతుల్లో 49, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆదుకోవడంతో 176/8 రన్స్ చేసింది. మార్క్మ్క్రు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది.
బౌండరీతో ఛేదనను ప్రారంభించిన సఫారీల విజయం పవర్ ప్లేలోనే దాదాపుగా ఖాయమైంది. మార్క్మ్ తొలి బంతి నుంచే దంచుడు మంత్రాన్ని జపించగా క్రీజులో కుదురుకున్నాక డికాక్ కూడా అదే బాటలో నడిచాడు. జోసెఫ్ 6వ ఓవర్లో అతడు.. 6, 4, 6తో అలరించాడు. మోటీ ఓవర్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. ఛేజ్ 8వ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన అతడు.. చివరి బంతికి హోల్డర్ చేతికి చిక్కడంతో 95 పరుగుల వద్ద సఫారీలు తొలి వికెట్ కోల్పోయారు. మోటీ ఓవర్లో సింగిల్‌తో 27 బంతుల్లోనే మార్క్మ్ ఈ టోర్నీలో మూడో అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. ఛేజ్ ఓవర్లో మార్క్మ్ రెండు, రికెల్టన్ ఒక సిక్స్ బాదడంతో లక్ష్యానికి చేరువైన ఆ జట్టు.. హోల్డర్ 17వ ఓవర్లో బౌండరీతో ఛేదనను విజయవంతంగా పూర్తిచేసింది.
ఎంగిడి, రబాడా ధాటికి విండీస్ టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. హోప్ (16), కింగ్ (21), హెట్మెయర్ (2), పావెల్ (9), ఛేజ్ (2), రూథర్‌ఫర్డ్ (12) దారుణంగా నిరాశపరిచారు. 10.2 ఓవర్లలో 83 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్.. పోరాడగలిగే స్కోరు చేసిందంటే అది హోల్డర్, షెఫర్డ్ చలవే. ఈ ఇద్దరూ సఫారీ బౌలర్లకు ఎదురొడ్డి 8వ వికెట్‌కు 57 బంతుల్లోనే 89 రన్స్ జోడించారు.
వెస్టిండీస్: 20 ఓవర్లకు 176/8 (షెఫర్డ్ 52*, హోల్డర్ 49, ఎంగిడి 3/30, బాష్ 2/31);
దక్షిణాఫ్రికా: 16.1 ఓవర్లకు 177/1 (మార్క్మ్ 82*, డికాక్ 47, ఛేజ్ 1/46)