దేవరుప్పుల/పెద్దవంగర/రాయపర్తి, జనవరి24: సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సంక్షేమ పథకా ల పేరుతో గ్రామసభలు నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. శుక్రవారం దేవరుప్పు ల, పెద్దవంగర మండలం గంట్లకుంట, రాయపర్తి మండలం మైలారం గ్రామాల్లో విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజల దృష్టి మరల్చేందుకే గ్రామసభలు పెట్టారని, అడుగడుగునా నిలదీతలతో రేవంత్ రెడ్డి పథకం బెడిసి కొట్టిందన్నారు. అర్హులందరికీ ఇండ్లివ్వాలంటే పదేళ్లు పడుతుందని, ఎవరిని మోసం చేయడానికి గ్రామసభలు పెట్టిండ్రని మండిపడ్డారు. ఓ వైపు ఉపముఖ్యమంత్రి భట్టి తాము అధికారికంగా ఇండ్లు, రేషన్ కార్డులు కానీ అనౌన్స్ చేయలేదంటున్నారని, ఇక గ్రామ సభ లెందుకు.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికా అని ఆయన ప్రశ్నించారు.
ఈ జిమ్మిక్కులన్నీ మాని ఇచ్చిన హామీలు నెరవేర్చండని హితవు పలికారు. పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ పర్యటనకు వెళ్లి ఏం సాధించిందో చెప్పాలన్నారు. అంతా ఉత్తదేనని, విమానం కిరాయిలు దండగన్నారు. ఈ ఫార్ములా రేస్, పారిశ్రామిక ఒప్పందాలతో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దిన నైపుణ్యం కేటీఆర్ వద్ద ఉంటే, ఆయనను కేసుల పాలు చేయాలని చూస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రపంచ పారిశ్రామిక వేత్తలకు నమ్మకం పోయిందని ఎర్రబెల్లి అన్నారు. గ్రామ సభల్లో తమకు సంక్షేమ పథకాలుగా గుర్తించి మంజూరు పత్రాలు అందజేస్తారని ఊహించిన వారికి అధికారులు అర్హుల జాబితాలను మాత్రమే చదువుతుండడంతో ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తోంటే ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంతో వాళ్ల గొంతులు నొక్నే ప్రయత్నాలు చేయిస్తున్నదని మండిపడ్డారు.
వారు కాంగ్రెస్‌కు మద్దతుదారులుగా వ్యవహరించడాన్ని తాము చూస్తూ ఊరుకునేది లేదని దయాకర్‌రావు హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, లేతాకుల రంగారెడ్డి, మధూకర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, బిల్ల వెంకట్‌రెడ్డి, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, సంది దేవేందర్‌రెడ్డి, గజవెల్లి ప్రసాద్, సంతోష్‌గౌడ్, పెరటి యాదవరెడ్డి, కుందూ రు యాదగిరిరెడ్డి, పరుపాటి రవీందర్‌రెడ్డి, మహ్మద్ యూసఫ్, ఎల్లస్వామి, సోమనర్సింహారెడ్డి, యాదగిరిరావు, వెంకన్న, సుధీర్‌కుమార్, భాస్కర్‌రావు, పూర్ణచందర్, కుమారస్వామి, హరీశ్‌యాదవ్, వెంకటయ్య పాల్గొన్నారు.