కరీమాబాద్ ఏప్రిల్ 22 : ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలని కోరుతూ మంగళవారం 43వ డివిజన్ మామునూరులో మాజీ మంత్రి, వర్ధన్నపేట ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు, 43వ డివిజన్ ఇన్చార్జి ఎల్లావుల లలిత యాదవ్ ఇంటింటికి తిరుగుతూ గోడ పోస్టర్లు అంటించారు. ఉద్యమకారులు, పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎర్రబెల్లి తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివవృద్ధిని సాధించిందన్నారు.
ఇవి కూడా చదవండి..
Bengaluru Attack: బెంగుళూరు దాడి కేసులో ట్విస్ట్.. డీఆర్డీవో ఆఫీసర్పై హత్యాయత్నం కేసు
Actress Rambha | అందుకే సినిమాలకు దూరం అయ్యాను : రంభ