హసన్పర్తి : ధాన్యం కొనుగోలు సెంటర్లో ధాన్యాన్నీ కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫల మైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దుయ్యబట్టారు. రెండో డివిజన్ వంగపహాడ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో కనీసం గన్నీ సంచులు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.
కాగా, కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించేందుకు లారీలు లేక నానాయాతన పడుతున్నారని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.