పాలకుర్తి/ పెద్దవంగర, ఫిబ్రవరి 12 : త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, ఈ ఎన్నికలతో ఆ పార్టీ ఖతమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బ్రోకర్ మాటలతో అధికారం చేపట్టిన రేవంత్‌రెడ్డి 15 నెలల పాలనలో దేవుళ్లపై ఒట్లు.. తేదీ లు, పేర్ల మార్పులు తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని.. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. బుధవారం పెద్దవంగర మండలకేంద్రంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి బీఆర్ఎస్ నాయకులతో సమీక్ష, పాలకుర్తిలోని పార్టీ కార్యాలయంలో చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ హామీల అమలులో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారన్నారు. స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసా వేస్తున్నారన్నారని ఆ తర్వాత భరోసాకు రాంరాం చెబుతారని ఎర్రబెల్లి విమర్శించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పాడిపంటలతో సస్యశ్యామలమై రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా, మూసీ పేరుతో హైదరాబాద్ అల్లోకల్లోలమవుతున్నదన్నారు. మరో 15 రోజుల్లో రైతాంగం సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై తిరుగబడతారని చెప్పారు.
గోదావరి జలాలు రాక చెరువులు, కుంటలు నిండక నీళ్లులేక పంట పొలా లు ఎండిపోతున్నాయని రైతులు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేలకు సఖ్యత లేదని.. అధిష్టానం ఓ తీరు.. రాష్ట్రంలో మరో తీరు ఉం డడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ నెలకొన్నదని మళ్లీ ఎన్నికలు వస్తే రాష్ట్రంలో మళ్లీ కేసీఆరే సీఎం కావడంతో పాటు ఎమ్మెల్యేలు 100 సీట్లు రావడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒకటీ నెరవేర్చలేదని రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ఆసరా పెన్షన్లు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలేవీ అమలుచేయకుండా అన్నీ పూర్తి చేశామని ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. సమన్వయం లేక ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణ చేయలేదని.. రేవంత్‌రెడ్డికి సమాచారం లేకుండానే వరంగల్ పర్యటనకు వస్తానని రాహుల్ గాంధీ ప్రకటించి.. అంతలోనే మార్చుకోవడంలోనే అర్థమవుతున్నదన్నారు. తొర్రూరును డివిజన్ కేంద్రం చేసి, 100 పడకల దవాఖాన చేస్తే ఇప్పటికీ అభివృద్ధి లేదన్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దానని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఆరు జడ్పీటీసీలు బీఆర్ఎస్కే రావడం ఖాయమని.. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని.. ప్రతి ఒకరికి అండగా ఉంటానని అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు.
పాలకుర్తి బీఆర్ఎస్ కార్యాలయంలో శాతాపురం శివారు దుబ్బతండా ఎస్పీ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ భూక్యా యాకూబ్ నాయక్, రవి, యాదగిరి, భాస్కర్, అనిల్, వెంకటి, రవి, సీతారాములతో పాటు సుమారు 30మంది నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, వీరికి ఎర్రబెల్లి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామానికి చెందిన యువకులు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి రావడంతో మాజీ మంత్రి దయాకర్‌రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, మాజీ జడ్పీ ఫ్లోర్‌లీడర్ శ్రీనివాస్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు యాదగిరిరావు, సోమ నర్సింహరెడ్డి, దేవస్థాన మాజీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, నాయకులు సుధీర్‌కుమార్, రాము, రవి, బిక్షపతి, మండల యూత్ అధ్యక్షుడు హరీశ్‌యాదవ్ పాల్గొన్నారు. పాలకుర్తిలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల ఆశోక్‌రెడ్డి, తాజా మాజీ జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, కారుపోతుల వేణు, బానోతు రమేశ్, లకావత్ వెంకట్ నాయక్, నాగరాజు, బానోతు మహేందర్, కమ్మగాని వెంకటేశ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలన లో పథకాల అమలు లో ప్రజలకు అన్యాయం జరుగుతున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలా గెలిచారో వాళ్లకే అర్థం కాక తర్జనభర్జన పడ్డారన్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేనివారు ఓవైపు.. మొదటినుంచీ కష్టపడి పనిచేసిన వారితో పార్టీలో సమన్వయం కొరవడిందని ఫలితంగా ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితిలో ఉన్నదన్నారు. కడియం శ్రీహరి ఊరవిష్కెలాంటోడని.. పంట ఎకడ పచ్చగుంటే.. అకడే ఉండే రకమని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి పరిస్థితి చూస్తుంటే పూట కో మాట.. లంచ్‌కు ముందు ఓ మాట.. లంచ్ తర్వాత మరో మాట.. అలాగే మంత్రుల మాటలు సైతం పొంతన లేకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ రా ష్ట్రానికి పెట్టుబడులతో ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ పాలన గాలికి వదిలి ఢిల్లీ, విదేశాల పర్యటనలు తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. తొలి సీ ఎం కేసీఆర్ రైతు సంక్షేమమే లక్ష్యంగా తాగు, సాగునీటి క ష్టాలు లేకుండా అందిస్తే.. ప్రతి ఆరు నెలలకు పంట పెట్టుబడి సహాయం అందిస్తే.. రేవంత్‌రెడ్డి మాత్రం ఇప్పటికీ ఏ ఒక రైతుకూ పూర్తిస్థాయిలో ఇవ్వని ఉన్నదని.. తేదీలను మార్చడమే తప్ప.. ప్రజలకు హామీలు నెరవేర్చడంలో కాం గ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.