వాజేడు, జూలై 9 : ఛత్తీస్గఢ్ రాష్ట్రంతోపాటు మండలంలో కురుస్తున్న వర్షాలకు చీకుపల్లి అటవీ ప్రాంతంలోని తెలంగాణ నయాగరా బొగత జలపాతంలోకి భారీగా వరద చేరుతున్న అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. 50 అడుగుల పైనుంచి కిందికి జాలువారుతూ జల సవ్వడులు చేస్తూ జలపాతం అలరిస్తున్నది. ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జలపాతం అందాలను చూసి ఫిదా అయ్యారు.
జలపాతం ముందు స్నేహితులు, కుటుంబ సభ్యులతో స్విమ్మింగ్ పూల్లో జలకాలాడుతూ ఎంజాయి చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పర్యాటకులతో జలపాతం వద్ద సందడి నెలకొంది. జలపాతం స్విమ్మింగ్ పూల్ వద్ద రక్షణగా అటవీశాఖ సిబ్బంది ద్వారా రక్షణ చర్యలు తీసుకున్నట్లు ఎఫ్ఆర్వో చంద్రమౌళి తెలిపారు.