హనుమకొండ చౌరస్తా, జూన్ 13: తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కమ్స్ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ 2025-26 హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో ముగిశాయి. ఈ టోర్నీలో భాగంగా కబడ్డీ 12 జట్లు, బాల్ బ్యాడ్మింటన్ 9 జట్లు పోటీ చేయగా కబడ్డీ నల్లగొండ మొదటి స్థానం కైవసం చేసుకోగా రెండో స్థానం వరంగల్ జట్టు, తృతీయ స్థానం నిజామాబాద్ సొంతం చేసుకుంది. బాల్‌బ్యాడ్మింటన్ మొదటి స్థానం వరంగల్ జట్టు, రెండవ స్థానం మహబూబ్‌నగర్, తృతీయ స్థానం నల్గొండ జట్లు కైవసం చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎన్పీడీసీఎల్ ఇంఛార్జి డైరెక్టర్ హెచ్ఆర్డీ బి.అశోక్‌కుమార్, ఇన్చార్జి డైరెక్టర్ ఆపరేషన్ మధుసూదన్, హనుమకొండ సూపరిండెంట్ ఇంజినీర్ పి.మధుసూదన్‌రావు, స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఏ విజయేందర్‌రెడ్డి, సాంబరెడ్డి, మల్లికార్జున్, ఎన్.జగన్నాథ్, ఎం.సంతోష్‌కుమార్, ఎండీ.యాకూబ్‌పాషా, వి.సునీల్‌కుమార్, ఈ.ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.