గీసుగొండ, ఫిబ్రవరి 26 : ఎలక్ట్రిక్ ఆటో కాలి బూడిదైన సంఘటన గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన భోగి శివకుమార్ ఇంటి ఆవరణలోఉన్న తన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ పియా గో ఆటో ఛార్జింగ్ అవుతున్న క్రమంలో ఒకేసారి మంటలు చెలరేగి కాలి బూడిద అయిందని ఆయన రోదిస్తూ తెలిపారు. 11 నెలల క్రితం పియాగో అప్పి ఈ సిటీ,టీజీ 24 t 0025 ఎలక్ట్రిక్ ఆటో కొత్తది ఐదు లక్షలతో కొనుగోలు చేశానని తెలిపారు.
ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నానని, రోజువారి మాదిరిగానే మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ఆటోకు చార్జింగ్ పెట్టి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో పదిన్నర గంటల సమయంలో ఒకేసారి ఆటో నుంచి మంటలు రావడంతో బయటికి వచ్చి చూసేసరికి కాలి మంటల్లో కాలిపోతుండగా.. చుట్టుపక్కల వారి సహాయంతో మంటలు ఆర్పినట్లు తెలిపారు. ఫైనాన్స్‌లో ఆటో కొనుగోలు చేశానని తెలిపారు. ఆటో తప్పా తన బతుకు దెరువుకు వేరే మార్గం లేదని ఆవేదన వెలిబుచ్చాడు. ఈ విషయంపై గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.