నర్సింహులపేట, సెప్టెంబర్ 18 : తాగునీటి కోసం నర్సింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి ఎస్సీకాలనీ మహిళలు తిప్పలు పడుతున్నారు. వాటర్‌ట్యాంక్ ఉన్నప్పటికీ పైపులు పగిలిపోయాయి. మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తుండడంతో పది రోజులుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి పట్టించుకోకపోవడంతో వ్యవసాయ బావుల వద్దకు వెళ్తే మిరప తోటలు, పొలం పారించడం కష్టమవుతోందని రైతులు అడ్డుకుంటున్నారని చెబుతున్నారు.
పది రోజులుగా నీళ్లు లేక బావుల కాడికి పోయి పట్టుకొస్తున్నం. పొలాలకు నీళ్లు పెట్టు కుం టున్నామని అక్కడికి రావొద్దని రైతులంటున్రు. వానకాలంలో నీళ్ల కోసం తిప్పలు ఎప్పుడూ చూడలేదు. పైఅధికారులు మా గోసను పట్టించుకోండి. మాకు నీళ్లు వచ్చేలా చేయండి సారూ. మీకు దండం పెడ్తాం.
– ఎర్పుల మంగమ్మ, కౌసల్యదేవిపల్లి