కాటారం, మార్చి 2 : వేసవికి ముందే తాగునీటి తండ్లాట మొదలైంది. శనివారం మండలంలోని గంగారం గ్రామం ములకల్లవాడలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో వచ్చి రోడ్డుపై బైఠాయించారు. తమ వాడకు మిషన్ భగీరథ పైపులైన్ వేయలేదని, అధికారులను అడిగితే దాటవేస్తున్నారని మొరపెట్టుకున్నారు. తాగునీటి సమస్య మున్ముందు మరింత జఠిలంగా ఉంటుందని, అధికారులు ఇప్పటికైనా తమకు మిషన్ భగీరథ నీటిని అందించాలని కోరారు.