కల్యాణలక్ష్మి ఆడబిడ్డలకు వరం
- ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. 112 మందికి చెక్కుల పంపిణీ
- కోమల్లలో కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన
రఘునాథపల్లి మే 19 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరమని స్టేషన్‌ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. మండల కేంద్రంలో గురువారం 112మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు భారంగా భావించేవారని, ఇప్పుడు అదృష్టంగా భావిస్తున్నారన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని, ఆడపిల్ల పుడితే రూ. 13వేలు, మగపిల్లవాడు పుడితే రూ.12వేలతో పాటు కేసీఆర్ కిట్టు ఇచ్చి ప్రభుత్వ వాహనంలోనే తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నారని పేర్కొన్నారు.
అంగన్వాడీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం పాలు, గుడ్లు, బాలామృతం అందిస్తున్నదన్నారు. అంతకు ముందుకు మండలంలోని కోమల్లలో కంచనపల్లికి వెళ్లే లోతువాగు వద్ద ఉపాధిహామీ నిధులతో చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గిద్దెబండతండాలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొల్లం అజయ్, ఎంపీపీ మేకల వరలక్ష్మి, తహసీల్దార్ అన్వర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వారాల రమేశ్‌యాదవ్, కార్యదర్శి ముసిపట్ల విజయ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్, సర్పంచ్‌లు కొయ్యడ మల్లేశ్, శంకరి అనిత, బొల్లపల్లి మంజుల, మండల సమన్వయ కమిటీ సభ్యులు మడ్లపల్లి సునీత-రాజు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి తాటికొండ వెంకటేశ్‌యాదవ్, ఎంపీటీసీ సుల్తాన్ దేవారెడ్డి, కన్నారపు ప్రభాకర్, కొయ్యడ స్వామి, పెండ్లి మల్లారెడ్డి, మేకల మురళి, చెంచు రమేశ్, నూనెముంతల యాకస్వామి, బానోత్ భిక్షపతినాయక్, ముక్క పరశురాములు, భీమనాథం శ్రీనివాస్, బాల్‌రెడ్డి, తాళ్లపల్లి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

