నడికూడ, అక్టోబర్ 5 : కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు నమ్మొద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నడికూడలో రూ.2.13కోట్లతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం, రూ.20లక్షలతో ధర్మారం, ముస్త్యాలపల్లి, చౌటుపర్తి గ్రామాల్లో నూతన జీపీ కార్యాలయాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లుగా పాలించి, రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టిందన్నారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. సీఎం కేసీఆర్ 9 ఏళ్లలో రాష్ట్రంలో వెలుగులు నింపారన్నారు. వారు పాలిస్తున్న రాష్ర్టాల్లో అమలు చేయకుండా ఇక్కడ ఎలా చేయగలరని ప్రశ్నించారు. జనధన్ ఖా తాల్లో ప్రజలకు డబ్బులు వేస్తామని చెప్పి ప్రధాని మోదీ మొండి చెయ్యి చూపించారన్నారు.
ఎన్నికల ఓట్ల కోసం గ్రామాల్లో తిరిగే ఇతర పార్టీ నాయకులను నిలదీయాలన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని ముందు వరసలో నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలను పొందాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గోల్కొండ ఉమాదేవి సదానందం, బొట్ల సంధ్యా రవి, గూడెం కృష్ణమూర్తి, ఎంపీపీ మచ్చ అనసూర్య, ఏసీపీ కిశోర్, ఏఎంసీ చైర్మన్ తిప్పని హైమావతీ సత్యనారాయణ, ఎంపీటీసీలు అప్పం చేరాలు, మేకల సతీశ్, తహసీల్దార్ నాగరాజు, పార్టీ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి గణపతిరెడ్డి, మాదారం సొసైటీ చైర్మన్ నల్లెల లింగమూర్తి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తిప్పర్తి సాంబశివారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు
పరకాల : ప్రారంభానికి సిద్ధమైన నూతన మున్సిపాలిటీ భవనాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పూర్తి చేయాల్సిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 9న మంత్రి కేటీఆర్ పరకాల పట్టణంలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నూతన మున్సిపాలిటీ భవనంతోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని చెప్పారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ భవనంలో చేపట్టాల్సిన పెండింగ్ పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీ భవనం ప్రారంభమైతే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందన్నారు. కార్యక్రమంలో వరంగల్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, దళితబంధు పట్టణ కోఆర్డినేటర్ సోదా రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ బండి సారంగపాణి, పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గీసుగొండ : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గీసుగొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ అధ్యక్షుడు దూడె దిలీప్, యూత్ అధ్యక్షుడు చీర సందీప్, యూత్ ఉపాధ్యక్షుడు ఎండీ పాషా, ప్రధాన కార్యదర్శి పోతరాజు అరుణ్, నాయకులు ఇనుముల వంశీ, మంద దినేశ్, పోతరాజు స్వామి, దూడె శ్రీకాంత్, చిరంజీవి, మంద నాగయ్య, ఎండీ రహీంలతోపాటు మరికొంత మంది ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, వైఎస్ ఎంపీపీ రడం శ్రావ్య, నాయకులు భరత్, జూలూరి లెనిన్‌గౌడ్ పాల్గొన్నారు.