కొమ్మాల జన సంద్రం
మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. హోలీ వేడుకల అనంతరం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. ఒంటె, ఏనుగు, గుర్రం, మేక తదితర ప్రభ బండ్లను అందంగా ముస్తాబు చేసి కోలాటాలు, లంబాడీ నృత్యాల నడుమ భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.
- లక్ష్మీనర్సింహస్వామి జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు
- గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు
- ప్రభలు, కోలాటాల సందడి
గీసుగొండ, మార్చి 25 : మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. హోలీ వేడుకల అనంతరం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. ఒంటె, ఏనుగు, గుర్రం, మేక తదితర ప్రభ బండ్లను అందంగా ముస్తాబు చేసి కోలాటాలు, లంబాడీ నృత్యాల నడుమ భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు సోమవారం రాత్రి స్వామి వారికి పూర్ణాహుతి ఇతర ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయం చుట్టూ భక్తి ప్రభలు తిరిగే ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంతమంతా మర్మోగింది. దర్శనం అనంతరం భక్తులు వంటలు చేసుకుని భోజనాలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. వరంగల్-నర్సంపేట మార్గంలో ఎడ్లబండ్ల సందడి కనిపించింది. రద్దీ దృష్ట్యా తిరుగు ప్రయాణంలో భక్తులు సూర్యతండా మీదుగా వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మామునూరు ఏసీపీ తిరుపతి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా, లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని రాజకీ య ప్రభలు కట్టొద్దని పోలీసులు హెచ్చరించినా కొంద రు నాయకులు రాజకీయ ప్రభలను కట్టి హల్చల్ చేశా రు. ఒక్కో రాజకీయ ప్రభ వెనుక 200 మంది కార్యకర్తలు డీజే సౌండ్స్ పెట్టి కాంగ్రెస్ నాయకులు సంబురా లు చేసుకున్నారు. కోడ్ అమల్లో ఉండడంతో బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ప్రభ బండ్లు కట్టడం విరమించుకున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

