Teachers FRS | ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ తిప్పలు
Teachers FRS | రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించిన ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల టీచర్లు ఒక్కోసారి ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Teachers FRS | పాపన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎఫ్ఆర్ఎస్ (Face Recognition System) ఉపాధ్యాయులకు చుక్కలు చూపెడుతుంది. ఒక్కోసారి బడికి వెళ్లగానే, బడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఫొటో దిగడానికి ఎంత ప్రయత్నించినా ఫొటో రాక ఉపాధ్యాయులు పడరాని పాట్లు పడుతున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటల15 నిమిషాలకు పాఠశాల వదలగానే ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్ దిగడానికి ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేదు.
కొంతమంది టీచర్లు (Teachers) ఫొటో దిగడానికి ప్రయత్నించగా వెంటనే యాప్ కట్ కాగా, మరికొందరికి టూ మెనీ లాగిన్స్, మరికొందరికి సర్వర్ ఎర్రర్ అంటూ రాసాగింది. దీంతో ఉపాధ్యాయులు చాలాసేపు ఎఫ్ఆర్ఎస్ దిగడానికి ప్రయత్నించి విఫలమవడంతో కొంతమంది టీచర్లు ఫొటో దిగకుండానే ఇంటికి వెళ్లారు. పాపన్నపేట పాఠశాలలో 25 మంది వరకు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలోనే ఇలా జరిగితే మండల వ్యాప్తంగా ఇంకెన్ని పాఠశాలల్లో ఇలా ఎఫ్‌ఆర్‌ఎస్‌తో ఇబ్బందులు పడ్డారో. ఇలా జరగకుండా ప్రభుత్వం తగిన పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

