Shijin Paul | దుబాయ్‌లోని కార్ల షోరూమ్‌లో సిలిండర్ పేలుడు.. భారతీయుడి దుర్మరణం
Shijin Paul | దుబాయ్ (Dubai) లోని ఓ కార్ల షోరూమ్ (Car Showroom) లో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలి భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కేరళ (Kerala) కు చెందిన షిజిన్ పాల్ (Shijin Paul) గా గుర్తించారు. తొలుత షోరూమ్ ప్రాంగణంలో మంటలు చెలరేగడంతో అందులోని సిబ్బంది బయటకు పరుగులు తీశారు.
Shijin Paul : దుబాయ్ (Dubai) లోని ఓ కార్ల షోరూమ్ (Car Showroom) లో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలి భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కేరళ (Kerala) కు చెందిన షిజిన్ పాల్ (Shijin Paul) గా గుర్తించారు. తొలుత షోరూమ్ ప్రాంగణంలో మంటలు చెలరేగడంతో అందులోని సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కొందరు ఆ మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో షిజిన్ మృతిచెందగా మరో ఐదుగురు గాయపడ్డారు.
ఈ ప్రమాదంపై స్పందించిన భారత రాయబార కార్యాలయం.. మృతుడి కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన 27 ఏళ్ల షిజిన్ పాల్.. గత నవంబర్లోనే దుబాయ్‌కి వెళ్లాడు. కారు షోరూమ్‌లో మల్టీమీడియా మార్కెటింగ్ స్పెషలిస్టుగా చేరాడు. ఎనిమిదేళ్లుగా ప్రేమించిన అమ్మాయిని 2025 లో వివాహం చేసుకున్న అతడు.. త్వరలోనే తన భార్యను కూడా దుబాయ్‌కు తీసుకెళ్లాలని అనుకున్నట్లు స్నేహితులు తెలిపారు. ఇంతలోనే దారుణం జరిగిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

