న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆప్ ఎమ్మెల్యే రాజిందర్ పాల్ కౌర్ చిన్నా(MLA Rajinder Pal Kaur).. ఓ ట్రక్కు డ్రైవర్ చెంప చెల్లుమనిపించారు. లూథియానా సౌత్‌కు చెందిన ఎమ్మెల్యే కౌర్ డ్రైవర్‌ను కొట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో పంజాబ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు దురుసగా ప్రవర్తిస్తున్నట్లు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ వాహనానికి దారి ఇచ్చేందుకు ట్రక్కు డ్రైవర్ కొంత సమయం తీసుకున్నాడు. ఈ సమయంలో తన వాహనం దిగి వచ్చిన ఎమ్మెల్యే కౌర్.. ఆ ట్రక్కు డ్రైవర్‌ను కిందకు దింపి చెంప చెల్లుమనిపించారు. ట్రక్కు డ్రైవర్‌తో ఏదో మాట్లాడిన ఆమె.. ఆ తర్వాత అతనిపై చేయి చేసుకున్నారు.
డ్రైవర్‌ను చెంపదెబ్బ కొట్టడం చూసి స్థానికులు షాక్ అయ్యారు. ట్రక్కు డ్రైవర్ రెచ్చగొట్టేలా మాట్లాడలేదని కొందరు అన్నారు. సీసీటీవీలో ఈ దృశ్యాలు చిక్కాయి. దాబా రోడ్డులో ఈ ఘటన జరిగింది. అయితే ఆ ఏరియాలో హెవీ వెహికిల్స్ ఎంట్రీపై నిషేధం విధించాలని కోరుతూ డిప్యూటీ కమీషనర్‌ను కోరినట్లు ఆ ఎమ్మెల్యే తెలిపారు. ఆ ట్రక్కు డ్రైవర్ చాలా ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయని, అయితే వాహనాన్ని ఆపి, తాళాలు ఇవ్వాలని అడిగానన్నారు. కానీ విపక్షాలు మాత్రం తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. తాను చేయి లేపి, అతని నుంచి కీస్ తీసుకున్నట్లు తెలిపింది. దాబా పోలీసు స్టేషన్లో కేసు బుక్ చేశారు. డ్రైవర్‌ను, తాళాలను పోలీసులకు అప్పగించారు.
The assault on a truck driver by AAP MLA Rajinder Pal Kaur Chhina in Ludhiana is a shocking display of arrogance and abuse of power.
Under Bhagwant Mann’s government, are AAP MLAs above the law?
CM Bhagwant Mann must answer: Will an FIR be registered against his MLA, or will… pic.twitter.com/6IVWEMNTS0
— Parminder Singh Brar (@PSBrarOfficial) September 15, 2026