నార్నూర్, సెప్టెంబర్ 15 : నార్నూర్, గాదిగూడ మండలాల అభివృద్ధికి సహకరించాలని ఆసిఫాబాద్ నియోజక వర్గం ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కోరారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం జామాడ, బలాన్ పూర్ గ్రామాలను జిల్లా కలెక్టర్ తో కలిసి పర్యటించారు. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి నీ, పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నార్నూర్, గాదిగూడ మండలం పరిధిలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి తనతో పాటు జిల్లా కలెక్టర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ కోరారు. అనంతరం భూ భారతిలో భాగంగా రైతులకు పట్టాలు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజార్షి షా మాట్లాడుతూ.. ప్రతి సమస్య దశలవారీగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెస్రం చందుర్ షావ్, తహసీల్దార్ జాడి రాజా లింగం, డిఎల్పిఓ ప్రభాకర్, ఎంపీడీవో పుల్లారావు, ఆర్డబ్ల్యూఎస్ డీ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి ఆకాష్, సిడిపిఓ శారద, ఎంఈఓ మనోహర్, సార్ మేడి మెస్రం దగ్గు పటేల్, ఆయా శాఖల అధికారులు, నాయకులు ఉన్నారు.