వరంగల్, అక్టోబర్ 7 : భద్రకాళీ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఐదో రోజు సోమవారం భద్రకాళీ అమ్మవారు లలిత మహా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
తెల్లవారుజామున అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం అమ్మవారిని లలిత మహా త్రిపుర సుందరిగా అలంకరించారు. ఉదయం పల్లకీ వాహన సేవ, సాయంత్రం శేష వాహనంపై అమ్మవారిని ఊరేగించారు. అమ్మవారిని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి దర్శించుకున్నారు.