వరంగల్, అక్టోబర్ 9 : భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజైన బుధవారం భద్రకాళీ అమ్మవారు సరస్వతీమాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రక్తబీజహ దుర్గా క్రమంలో అమ్మవారికి పూజారాధన చేశారు. అమ్మవారిని రథంపై ఊరేగించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అమ్మవారిని దర్శించుకున్నారు.