స్వరాష్ట్ర ఉద్యమానికి ఊపిరులూదిన నవంబర్ 29ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా అంతటా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించారు. నాడు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం కదం తొక్కిన తీరుగా పల్లె, పట్నం అనే తేడా లేకుండా శ్రేణులు, కార్యకర్తలు వేలాదిగా గులాబీ జెండాలతో భారీ ర్యాలీలతో తరలివచ్చారు. ఈ సందర్భంగా జై కేసీఆర్.. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. జిల్లాకేంద్రాల్లోని ‘దీక్షా’ స్థలికి చేరుకొని జిల్లా ఇన్చార్జిలు, బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి ఉద్యమ జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అమరులకు, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే కేసీఆర్ దీక్ష సన్నివేశాలతో రూపొందించిన ఫొటో గ్యాలరీ, వీడియో(ఏవీ)ని తిలకించి.. ఉద్వేగానికి లోనయ్యారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్
జనగామలో దీక్షా దివస్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి, జిల్లా ఇన్చార్జి భిక్షమయ్య గౌడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాటికొండ రాజయ్య, వరంగల్‌లో ఇన్చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. భూపాలపల్లిలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, గండ్ర, హనుమకొండలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, దాస్యం వినయ్‌భాస్కర్, వొడితెల సతీశ్‌కుమార్, మానుకోటలో ఇన్చార్జి కోటేశ్వర్రావు, మాలోత్ కవిత, రెడ్యానాయక్, శంకర్‌నాయక్, ములుగులో ఇన్చార్జి మారెపెల్లి సుధీర్‌కుమార్, లక్షీనర్సింహారావు, బడే నాగజ్యోతి పాల్గొన్నారు.
జనగామ, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తన ప్రాణాలను సైతం లెకచేయకుండా ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన గొప్పరోజని, ఇది నాటి చరిత్రకు పునాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామలోని నెహ్రూ పార్కు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్ర హం వద్ద నివాళులర్పించి.. వేదిక ప్రాంగణంలో కేసీఆర్, తెలంగాణ స్తూపం ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి భిక్షమ య్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యతో కలిసి ఎర్రబెల్లి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ ఆనాడు కేసీఆర్ చేసిన ఉద్యమ ఫలితమే నేటి బంగారు తెలంగాణ అని అన్నారు. తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఆగం కాకూడదని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి బంగారు తెలంగాణ చేశారని, పుట్టబోయే బిడ్డ నుంచి చనిపోయిన వ్యక్తి వరకు ప్రతి ఒకరికి లబ్ధి చేకూరేలా పథకాలు రూపొందించారని పేర్కొన్నారు.
రైతు ను రాజు చేసింది కేసీఆర్ అయితే రైతు వెన్నెముక విరిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఆనాడు కేసీఆర్ వల్ల నే రాష్ట్రం సాధ్యమైందన్న రేవంత్‌రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి కాగా నే బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తొందరలో నే ఆ తుపాకిరాముడి తుప్పు ప్రజలే వదిలిస్తారన్నారు. దీక్షా దివస్ కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాదని యావత్ తెలంగాణదన్నారు. గులాబీ కార్యకర్తలు, రైతులు, పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోమని.. ఎంతకైనా పోరాడుతామని అన్నారు.
తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ పోరాటం చేసిన గడ్డ ఇది. ఇకడ ఉన్న ప్రతి గ్రామం ఒక చరిత్ర..కేసీఆర్ చేసిన పోరాటం ఏంటనేది ఇకడి చిన్న పిల్లాడికి కూడా వారసత్వంగా వస్తది. ఈ గడ్డపై అసలు సిసలైన తెలంగాణ సైనికులు 10 నెలల కాంగ్రెస్ నిర్భంధంలోనూ ఏ ఒకరూ గులాబీ జెండా వదిలి పెట్టలేదు. కేసీఆర్ సంకల్ప దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపో తుంది. లగచర్ల, దిలావర్పూర్ అమాయక గిరిజనులు నడుం కట్టి పోరాటం చేస్తే రేవంత్‌రెడ్డి సర్కారు నిర్ణయాన్ని వెనకి తీసుకుంది.
ఈ పోరాట స్ఫూర్తితో అందరూ ముందుండాలి. 10 నెలల్లోనే పదేళ్ల విధ్వంసాన్ని రేవంత్‌రెడ్డి చేసి చూపించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉపఎన్నిక కావొచ్చు.. రాష్ట్రంలో ఎకడ ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కడియంకు సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేయాలి. ఆయన బిడ్డ, వియ్యంకుడు, అల్లుడికి తప్ప ఎవ్వరికీ ఏ ప నులు చేయడు. ఘన్‌పూర్‌కు వంద పడకల ఆస్పత్రి, రోడ్లు, సూల్, మున్సిపాలిటీ ఇవ్వన్నీ తాను, మాజీ ఎమ్మెల్యే రాజన్న కలిసి తెచ్చినం తప్ప కడియం తెచ్చింది ఏమీలేదు. దమ్ముంటే ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలి.
– ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
కేసీఆర్ దీక్ష చేయకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా..? జనగామ జిల్లా ఉండేది కాదు.. రేవంత్‌రెడ్డి కనీసం వార్డు మెంబర్ కూడా ఉండేవాడు కాదు.. ఇది ఒక పవిత్రమైన దినం.. తెలంగాణలో ప్రతి ఒకరూ గుర్తుంచు కోవాల్సిన రోజు. కేసీఆర్ ఆనాడు చేసిన పోరాటాన్ని సాధించిన ఘనతను గ్రామాల్లో ప్రజలకు వివరించి రానున్న రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా ఆంధ్రా మూటలు మోసిన రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలి.
– దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి బూడిద భిక్షమయ్యగౌడ్
లగచర్ల రైతుల తెగింపుకు రేవంత్‌రెడ్డికి దిమ్మతిరిగింది. అక్కడ ఫార్మా కంపెనీ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో ముకు నేలకు రాసేలా ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇది కేసీఆర్ ఉడుము పట్టుకు నిదర్శనం. ఎమ్మెల్యే కడియం శ్రీ హరి నమ్మక ద్రోహి, గుంట నక, అవకాశవాది. బీఆర్ ఎస్ నుంచి గెలిచి బిడ్డకు ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్‌లోకి పోయాడు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మరోసారి రగిలించి రేవంత్‌రెడ్డిని గద్దె దించాలి.
– తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే
మహబూబాబాద్‌లో మాట్లాడుతున్న దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి కోటేశ్వర్రావు, చిత్రంలో మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్
ములుగులో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, జడ్పీ మాజీ చైర్మన్లు బడే నాగజ్యోతి, సుధీర్‌కుమార్
వరంగల్‌లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి నినాదాలు చేస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి, జిల్లా ఇన్చార్జి ముత్తిరెడ్డి, నన్నపునేని, చల్లా, పెద్ది
హనుమకొండ పార్టీ ఆఫీస్‌లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తున్న నాగుర్ల