నయీంనగర్, జూలై 11: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్స్ పూర్తి చేయడంలో ఓటర్లకు సహాయంగా ఉండాలని మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శనివారం57వ డివిజన్లోని టీవీ టవర్ కాలనీలో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
క్షేత్రస్థాయిలో ఉంటూ ఓటర్లకు ఉన్న సందేహాలు, సమాచారాన్ని ఆన్లైన్, ప్రింట్ ఓటరు లిస్టుల ద్వారా ప్రజలకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో దూలం వెంకన్న, రవి, సందీప్, బాషా, కృష్ణ, అనిల్‌కుమార్, ప్రభాకర్, వెంకన్న, రఘోత్తంరెడ్డి, లింగారెడ్డి, రాజేం దర్, సంతోష్‌కుమార్, సమ్మయ్య, విష్ణు, సతీశ్, రవికుమార్, రమేశ్, రాజమౌళి, పాషా, మంజూ ర్, పద్మావతి, స్వామి, నరేశ్, స్వరూపరాణీ, సుధాకర్ పాల్గొన్నారు.