హనుమకొండ, మార్చి 19: మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే కుట్టుమిషన్లు అందజేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పోచంపల్లి ఫౌండేషన్, ఏపీఎల్ హెల్త్ కేర్ ఆర్థికసాయంతో సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారి నిర్వహణలో మహిళలకు గతంలో ఉచిత శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశా రు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వినయ్ భాసర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై 378 మంది లబ్ధిదారులకు కుట్టుమిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా వినయ్‌భాసర్ మాట్లాడు తూ బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు. వరంగల్‌కు కేసీఆర్ టెక్స్టైల్ పారును తీసుకొచ్చారన్నారు.
మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి నగరంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మించామని తెలిపారు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. వచ్చే నెల 27వ తేదీన జరిగే బీఆర్ ఎస్ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మా ట్లాడుతూ 45 రోజుల పాటు మహిళలకు ఉచితంగా భోజనం పెట్టి శిక్షణ ఇచ్చామన్నారు. మహిళలు ఒకరి మీద ఆధారపడకుండా వారి కాళ్ల మీద వా రు నిలబడాలని సూచించారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా కుట్టుమిషన్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ సర్టిఫికెట్స్‌తో టెక్స్టైల్ పార్లో ఉద్యోగాలు పొందవచ్చని అన్నారు.
ఇప్పటి వరకు 6వేల మందికి కుట్టుమిషన్లు అందించామని, రానున్న రోజుల్లో మరో 3 వేలు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తామ న్న ఏ ఒక పథకానికి బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి, సంక్షేమానికి పెద్ద పీట వేసిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ కుట్టుమిషన్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. టెక్స్టైల్ పార్ను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, పెద్దపెద్ద కంపెనీలకు ప్రోత్సాహకాలు తగ్గిపోయాయన్నారు. మహిళలకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని, వారిన మోసం చేసిందని అన్నారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చి మ నియోజకవర్గం కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, వెంకన్న, రఘు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.