Dasyam Vinay Bhasker | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 22: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ వినయ్‌భాస్కర్ గోత్రనామాలతో అర్చన, అభిషేకం చేయించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బుద్ధ వెంకన్న, పోలేపల్లి రామ్మూర్తి, మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీనారాయణ, మేకల బాపురావు, నాయకులు శ్రీధర్, వరుణ్, రఘు, అశోక్, మోహన్ పాల్గొన్నారు. 5వ డివిజన్ అధ్యక్షుడు పున్నంచందర్ చందర్ గారి ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి వినయ్‌భాస్కర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పండగ సాగర్, తాడిశెట్టి రాము, కానుగంటి అరవింద్, ప్రభాకర్, దాసరి సమ్మన్న, గొర్రె విజయ్, లింగాల జనార్ధన్, రమేష్‌నాయక్, రఘు, నారాయణగిరిరాజు, మూల ప్రభాకర్, లాలు, మహిళా అధ్యక్షురాలు లత, శ్రీముఖి, మౌనిక, శ్రీలత, రమ, నిహారిక పాల్గొన్నారు.

కేయూలో బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో వినయ్‌భాస్కర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ యూత్ నాయకులు బొల్లికొండ వీరేందర్, కత్తెరపెల్లి దామోదర్, మాచర్ల శరత్చంద్ర, జెట్టి రాజేందర్, తుపాకుల రవి, సంగని సూర్యకిరణ్, ఆరూరి రంజిత్, గండ్రకోట రాకేష్‌యాదవ్, గొల్లపల్లి వీరస్వామి, కందికొండ తిరుపతి, కోనకోటి ప్రశాంత్, పస్తం అనిల్, కొరపెల్లి రాజేష్, రాసూరి రాజేష్, హనుమకొండ స్నేహిత్, బుర్ర మహేష్ పాల్గొన్నారు.