హనుమకొండ చౌరస్తా,సెప్టెంబర్ 7: చిన్నారులే భవిష్యత్ నిర్మాతలని.. చిట్టి చేతులు గొప్ప మార్పులో భాగమయ్యాయని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మడిపెల్లికి చెందిన చిన్నారులు మట్టి వినాయక విగ్రహాన్ని సొంతంగా తయారుచేసి గణేష్ నవరాత్రుల్లో భాగంగా ప్రతిష్టించగా విద్యార్థుల్లోని పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని ఆయన మెచ్చుకున్నారు. ఆదివారం వడ్డేపల్లిలోని వినయ్‌భాస్కర్ ఇంటికి వారిని పిలిపించి అభినందించారు. ఆ చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారుల్లోని సామాజిక స్పృహను మెచ్చుకున్నారు.
చిన్నారులకు బహుమతిగా జామెట్రి బాక్స్‌లు, బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్స్అందించారు. అనంతరం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థి దశలోనే చిన్నారులకు సామాజిక బాధ్యత విషయాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో చిన్నారులు అక్షిత, వశిష్ట, అనుశ్వి, విశ్వాన్, ఆదిత్య, శ్రీహర్ష, కీర్తి, రోహిత్, సాయిశరణ్య, మనస్వి, భవ్యశ్రీ, శ్రీనిత్య, సాత్విక్, రుత్విక్, సాయిదీప్, సహస్ర, నాయకులు రఘు, ప్రవీణ్, నవీన్, రంజిత్, అనిల్ ఉన్నారు.