న్యూశాయంపేట: ఏప్రిల్ 01: వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ , భారత రాష్ట్ర సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. న్యూశాయంపేట కూడలి కేంద్రంలో వేల్పుల వీరస్వామి జ్ఞాపకార్థం శ్రీదుర్గా గ్రానైట్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వరంగల్ తూర్పు మాజీ శాసన సభ్యుడు నన్నపనేని నరేందర్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన శ్రీదుర్గా గ్రానైట్స్ సంస్థ నిర్వాహకులను అభినందించారు. సామాజిక సేవలో భాగంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. ప్రజలు చలి వేంద్రాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వేల్పుల మోహన్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జానకి రాములు, సదానందం, వేల్పుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.