బచ్చన్నపేట ఆగస్టు 25 : రోడ్డు మరమ్మతులు చేయాలని సిపిఎం బచ్చన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కొడవటూర్ కమాన్ నుండి జనగామ రోడ్డు పోలీస్ స్టేషన్ వరకు వందలాది మందితో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కనకా రెడ్డి మాట్లాడుతూ.. బచ్చన్నపేట మండల కేంద్రంలోని రోడ్లో మరమ్మతులపై అధికారులు నిర్లక్ష్యం చేయడం సరైంది కాదనన్నారు. రోడ్లు సరిగా లేక అనేక ప్రమాదాలు జరుగుతు న్నాయ న్నారు. రోడ్ల విస్తరణ కోసం నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్తున్నారే తప్ప ఆచరణలో అమలు కావడం లేదన్నారు.
ధ్వంసమైన నేషనల్ హైవే రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని, వారం రోజులలో గుంతల మయమైన రోడ్డును మరమ్మతులు చేసి సమస్యను పరిష్కారం చేయకుంటే కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. పాదయాత్ర అనంతరం సిల్దార్ రామానుజ చారికి వినతిపత్రం అందించారు. ఈ పాదయాత్రలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్ మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్, మండల కమిటీ సభ్యులు రావుల రవీందర్ రెడ్డి, మిన్నలాపురం ఎల్లయ్య బలరాం, అన్న బోయిన రాజు, పర్వతం నర్సింలు, తాడెం రాములు,గోలకొండ ఈదమ్మ మన్నె లక్ష్మీ, కల్పన, ఇంజ ఎల్లయ్య,సీనియర్ నాయకులు ఎడబోయిన రవీందర్ రెడ్డి,అన్న బోయిన శ్రీనివాస్ రామగళ్ళ అశోక్, బోదాస్ సుధాకర్,కంత్రి ఐలయ్య శాఖ కార్యదర్శిలు బుర్రి సుధాకర్,బడంగల బలరాములు బాలరాజు, సమ్మయ్య,ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి బోదాస్ మురళి తదితరులు పాల్గొన్నారు.