హనుమకొండ, అక్టోబర్ 7: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడిని నిరసిస్తూ మంగళవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద సిపిఎం నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా సిపిఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సంఘ్ పరివార్ వ్యాప్తిచేసిన విద్వేషానికి ప్రతిబింబమే ఈ భయంకరమైన సంఘటన అని అన్నారు. దేశసర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై సనాతనధర్మోన్మాదం తలకెక్కించుకున్న న్యాయవాది రాకేష్కిషోర్ బూటు విసిరి దాడికి యత్నించిన అత్యంత ఆందోళనకర ఘటన అన్నారు. దీన్ని ప్రజలు, ప్రజాతంత్ర, లౌకిక వాదులు తీవ్రంగా ఖండించాలన్నారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తూ సైద్ధాంతికంగా ఒక పథకం ప్రకారం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు. సిపిఎం హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు ఎం.చుక్కయ్య మాట్లాడుతూ ఈ ఘటన ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గొడుగు వెంకట్, వాంకుడోతు వీరన్న, దొగ్గెల తిరుపతి, నాయకులు ఓరుగంటి సాంబయ్య, ఎం.రమాదేవి, మంద మల్లేశం, వల్లెపు రాజు, జంపాల రమేష్, కె.సుదర్శన్, డి.రాజేందర్, సాంబయ్య, మంజుల, మానస, సమ్మయ్య, లచ్చమ్మ, రాధిక పాల్గొన్నారు.