హనుమకొండ, మే 13 : 4వ డివిజన్ పెద్దమ్మ గడ్డ ప్రాంతంలోని జ్యోతిబస్ నగర్ ఫేస్ -1, 2, రెండవ డివిజన్ భగత్ సింగ్ నగర్ కాలనీలలో గత 20 సంవత్సరాలకు పైగా నివాసముంటున్న పేదలకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బొట్ల చక్రపాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండ ఇన్చార్జి తహసిల్దార్ రంజిత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ ప్రభుత్వం పేదోళ్లకు సొంతింటికల నెరవేర్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకం కాలనీవాసులకు అందరి ద్రాక్ష లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నగరంలో ఇల్లు లేని పేదలు ఇండ్ల కిరాయి కట్టలేక గత 20 సంవత్సరాల క్రితం జ్యోతి బస్ నగర్ ఫేస్ -1,2, భగత్‌సింగ్ నగర్లో గుడిసెలు వేసుకొని నివాసముంటూ కరెంటు మీటరు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంటి నెంబరు, నల్ల కనెక్షన్ ఉండి ట్యాక్సీలు చెల్లిస్తున్నారన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే వారికి పట్టాలి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ నార్త్ ఏరియా కార్యదర్శి గాదె రమేష్, నాయకులు ఇంజపల్లి రాజు, మంద మల్లేశం, బొట్ల కుమారస్వామి, ఒంటెల పాపయ్య, ఆర్ రాజు, అమృత, కళావతి, యమున, స్వప్న తదితరులు పాల్గొన్నారు.