హనుమకొండ, సెప్టెంబర్ 16 : నేడు ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అమాయకులను మోసం చేయడంలో సైబర్ క్రైమ్ ప్రధానమైందని, దీనిని నివారించుటకు యువత అప్రమత్తంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. ఆర్ట్స్‌కాలేజీలో సైబర్ క్రైమ్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరాలకు ఎవరు పాల్పడిన చట్ట ప్రకారం శిక్షించబడతారని, సైబర్ నేరాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా ఇటీవల ఏఐ సాంకేతిక విధానం ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అమాయకులను దోచుకుంటున్నారని చెప్పారు.
యువత అమాయకంగా ఎవరిని నమ్మడం గాని, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు లోను కాకూడదని పీపీ అన్నారు. కేయూ రిజిస్టర్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం మాట్లాడుతూ ఆపదలో ఉన్నామంటూ మనకు తెలిసిన ముఖాలు తగిలించుకొని సైబర్ నేరాలకు పాల్పడడం జరుగుతుందని యువత అలాంటివాటిని ఎదుర్కొనేవిధంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్లు మనకు తెలవకుండానే మన ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ నెంబర్‌తో అనుసంధానం చేసుకొని మనకు తెలవకుండా బ్యాంకులో ఉన్న డబ్బును దోసుకుంటున్నారన్నారు.
మనకు తెలియనివారు, ఎవరైనా ఫోన్ చేసిన మెసేజ్ పెట్టిన, వెంటనే స్పందించవద్దని ఎవరైనా నేరాలకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయని. డ్రగ్స్, మత్తు పదార్థాలకు లోన్ కాకూడదని ప్రొజెక్టర్ ద్వారా సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి, సైబర్ క్రైమ్ ఏసీపీ కె.గిరికుమార్, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, వరంగల్ ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ, నార్కోటెక్ ఇన్స్పెక్టర్ సతీష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.