గీసుగొండ, ఏప్రిల్ 5 : దేశానికి సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనం గురువారం మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్లో జరిగింది. మండలంలోని కొమ్మాల, సూర్యతండా, విశ్వనాథపురం, నందనాయక్‌తండా, దస్రుతండా, మచ్చాపురం, హర్జ్యాతండా, గంగదేవిపల్లి, ఎలుకుర్తి, ఆరెపల్లి, వంచనగిరి, శాయంపేట, ఊకల్, మరియపురం గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వంపై బురద చల్లుతున్నాయన్నారు. 50 సంవత్సరాలు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ ఈ దేశానికి ఏం చేసిందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని మరిచి దేశాన్ని దోచుకొని వాళ్ల ఆస్తులను పెంచుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ దేశంలో మత రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తుంటే జీఎస్టీ పేరుతో కేంద్రం అడ్డగోలుగా పన్నులు వసూలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని అడిగితే, ఉచితంగా రైతులకు ఏదీ ఇవ్వొద్దని కేంద్రం నీతిమాలిన మాటలు చెబుతోందన్నారు. కోనాయిమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలోని 1450 ఎకరాలకు సాగు నీరు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. వచ్చే తరం ప్రజలు సీఎం కేసీఆర్ చరిత్రను కథలు కథలుగా చెప్పుకుంటారన్నారు.
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షం..
దేశానికి, రాష్ర్టానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అన్ని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు నయాపైసా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నదని చెప్పారు. పరకాలను ఎమ్మెల్యే చల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడన్నారు. కేసీఆర్ దయతో ప్రజలకు సేవ చేసే అదృష్టం వచ్చిందన్నారు. అనంతరం బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా, ఎమ్మెల్యే చల్లా, ఎంపీ పసునూరిని బార్ అసోసియేషన్ ఈసీ మెంబర్ కొంగర పూర్ణచందర్ సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు రా జబోయిన రజిత, గోనె మల్లారెడ్డి, బోడకుంట్ల ప్రకాశ్, అంగోత్ కవిత, వాడికారి జ్యోతి, పూండ్రు జైపాల్‌రెడ్డి, వీరాటి కవిత, వాంకుడోత్ రజిత, అంకతి నాగేశ్వర్రావు, బాదావత్ అమ్మి, కేలోత్ సరోజన, ఎంపీటీసీలు కంబాల రజిత, బేతినేని వీరారావు, యూత్ మండలాధ్యక్షుడు శిరిసె శ్రీకాంత్, దళితబంధు కన్వీనర్ ప్రమోద్, మహిళ విభాగం అధ్యక్షురాలు కొండారాధ, ముఖ్య నాయకులు ముంత రాజయ్య, డోలి చిన్ని, వీరాటి రవీందర్‌రెడ్డి, కొండా వెంకన్న, కొంగ చంద్రమౌళి, నర్సింగరావు, ధనుంజయ్, నర్సింగరావు, రమేశ్, మానయ్య, పూర్ణచందర్, వీరన్న, రఘపతిరెడ్డి, మాధవరెడ్డి, అభిషేక్, నాగయ్య, లెనిన్, వీరన్న, వినోద్, బాలరాజు, రాజు, కొమురయ్య, రాములు, అఖిల్, రమేశ్, మోతీలాల్, గోపి పాల్గొన్నారు.