ములుగు : పాఠశాల వంట కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభానికి రెండు రోజులే సమయం ఉంది. కానీ వంట కార్మికులకు గత సంవత్సరం వంట బిల్లులు, వేతనాలు, కోడి గుడ్ల బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి. అలాగే 2023 అక్టోబరు నెల నుండి అల్పాహారం బిల్లులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు.
ఇప్పటికే చాలీ చాలని జీతాలతో పని చేస్తున్న వంట సిబ్బందికి పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందిగా మారిందన్నారు. అలాగే రాగి జావ తయారు చేయడానికి అదనంగా ఖర్చు అవుతున్నది.
రాగి జావ తయారీ కోసం ప్రభుత్వం ప్రతి విద్యార్థికి రెండు రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రూ 10 వేల వేతనం వెంటనే చెల్లించాలన్నారు. పాఠశాలలు ప్రారంభానికి ముందే పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు ముత్యాల రాజు, సంఘం జిల్లా అధ్యక్షురాలు సామల రమ, పోరెడ్డి ప్రమీల, గడ్డం భారతి, లక్ష్మి,పి సమ్మక్క, జమున, సుశీల, విజయ, చెంచులక్ష్మి, రమణ, వెంకటలక్ష్మి, రాజ్యలక్ష్మి, రాజకుమారి, పద్మ, షఫియా, జానకి,జే లక్ష్మి,యం సరోజన, సుమతి, నర్సమ్మ, తులసి, కుమారి, వెంకటరమణ, రమాదేవి, ఫైమా, లావణ్య, నాగమణి, భవాణి, సుగుణ, తదితరులు పాల్గొన్నారు.