రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమంతో సర్కారు పాఠశాలలకు నిరంతరం మిషన్ భగీరథ నీటి సరఫరా జరుగనుంది. ప్రతి విద్యార్థికి 45 లీటర్ల నీరు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆయా పాఠశాలల్లో నీటి నిల్వ ట్యాంకులు, సంప్‌లు నిర్మించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సర్కారు మూడు దశల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే మన బడి కార్యక్రమం ద్వారా మొదటి దశలో అభివృద్ధి చేసేందుకు 35శాతం పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా తొలి విడుత జిల్లాలో 223 పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు అధికారులు కసరత్తు చేస్త్తున్నారు. ఇంజినీరింగ్ ఏజెన్సీలు కూడా ఆయా మండలాల్లో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అవసరాలను గుర్తిస్తున్నాయి.
– వరంగల్, ఫిబ్రవరి 26(నమస్తేతెలంగాణ)
వరంగల్, ఫిబ్రవరి 26(నమస్తేతెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందుకు సాగుతున్నది. ఇం దులో భాగంగా మన ఊరు- మన బ డి, మన బస్తీ- మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలలల్లో అవసరాను గుర్తించేందుకు ఇంజినీరిం గ్ ఏజెన్సీలను నియమించింది. ఆయా మండలాల్లో ఈ ఏజెన్సీలు పాఠశాలలకు మిషన్ భగీరథ నీటి సరఫరా, టాయిలెట్ల నిర్మాణం, ప్రహరీ, మెట్ల నిర్మాణంతో పాటు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం పలు నిర్మాణాలు జరిపేందుకు ప్రతిపాదనలు చేస్తున్నా యి. వీటిలో పాఠశాల నిర్వహణ కమిటీ(ఎస్ఎంసీ)లు ఎంపిక చేసిన అవసరాలపై ఇంజినీర్లు అంచనాలను రూ పొందిస్తున్నారు. ఎస్‌ఎంసీల తీర్మానం మేరకు సదరు ఎస్టిమేట్లకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుంది.
ఈ కార్యక్రమం అమలుకు రాష్ట్ర ప్ర భుత్వం విడుదల చేసిన మార్గదర్శకా ల్లో మూడు దశల్లోనూ అభివృద్ధి చేసే ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒక్కో వి ద్యార్థికి 45 లీటర్ల సామర్థ్యం ఆధారంగా ప్రతి పాఠశాలలో సంప్‌ను రూపొందించాలని సూచించింది. ట్యాంక్‌కు నీటిని ఎత్తిపోసేందుకు పంపు సెట్ అమర్చాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. టెర్రస్‌పై వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ఆర్సీసీ నీటి నిల్వ ట్యాంకులు నిర్మించాలని పేర్కొంది. ఈ మేరకు ఇంజినీర్లు అంచనాలు వేస్తున్నారు. నిరంతరం నీటి సరఫరా జరిగేలా పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు ఎస్టిమేట్స్ రెడీ చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 మంది బాలికలకు ఒక మూత్రశాల, 40 మంది బాలికలకు ఒక మరుగుదొడ్డి, 20 మంది బాలురకు ఒక మూత్రశాల, నలభై మంది బాలురకు ఒక మరుగుదొడ్డి, ఉన్నత పాఠశాలలో ఇరవై మంది బాలికలకు ఒక మరుగుదొడ్డి, ఇరవై మంది బాలురకు ఒక మూత్రశాల, న లభై మంది బాలురకు ఒక మరుగుదొ డ్డి, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కో సం స్పెషల్‌గా టాయిలెట్లు నిర్మించేందుకు అంచనాలు రూపొందిస్తున్నారు. ప్రతి పాఠశాలలో నల్లాలతో పాటు చే తులు శుభ్రపరుచుకొనేందుకు వాష్ బే షన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ర్యాంప్, రెయిలింగ్ నిర్మాణానికీ ఇంజినీర్లు ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల కోసం భోజనశాలల ఏర్పాటుకు ఇంజినీర్లు అంచనాలు రూ పొందిస్తున్నారు. వంద మంది విద్యార్థులు ఉంటే 13.28 మీటర్ల పొడవు, 10.25 మీటర్ల వెడల్పు, 200 మంది ఉంటే 22.30 మీటర్ల పొడవు, 12.25 మీటర్ల వెడల్పు, 300 మంది ఉంటే 31.27 మీటర్ల పొడవు, 12.25 మీటర్ల వెడల్పుతో భోజన శాలలను నిర్మించనున్నారు. ఎనిమిది మంది కూర్చునేలా ఎస్ఎస్ 304 గ్రేడ్ డైనింగ్ టేబుల్, బెంచీలను కూడా ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్నారు. వంట కోసం ఆర్సీసీ స్లాబు గల స్టోర్ రూం, షీటు కప్పుతో వంట చేసే ప్రదేశం, వంట పాత్రల ప్లాట్‌ఫాం, నీటి సరఫరా ఏర్పాటుకూ ఇంజినీర్లు అంచనాలు రూపొందిస్తున్నారు. ప్రతి పాఠశాలకు ఆర్సీసీ కాలమ్స్‌తో పునాది కలిగిన ప్రహరీ నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. 1.5 మీటర్ల ఎత్తుతో 9 ఇంచు ల మందం గల ఇటుక గోడ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.