రాయపర్తి, మార్చి 29 : ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగెత్తిపోయి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం రాయపర్తి మండలకేంద్రానికి చెందిన సుమారు 20మంది సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువాలు కప్పి ఆయన సాదరంగా ఆహ్వానించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నిక ల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఎన్నికల మ్యా నిఫెస్టో, డిక్లరేషన్ల పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ గత 15 నెలల పరిపాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నదని విమర్శించారు.
గతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తక్కువ కాలంలోనే కాంగ్రెస్ సర్కారు ప్రజల నుంచి ఛీత్కారాలకు గురవుతూ అభాసుపాలవుతున్నదని చెప్పారు. గద్దెనెక్కిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేని రేవంత్‌రెడ్డి.. పరిపాలించే హక్కు కోల్పోయాడని మండిపడ్డారు. ఓ వైపు రైతాంగం సాగు జలాలు లేక, తీవ్రమైన కరెంట్ కోతలతో అల్లాడుతుంటే ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధిని గాలికి వదిలేసి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్‌రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారన్నారు. అనంతరం పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్తను కంటికి రెప్ప లా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రేవంత్ ప్రజాదర్బార్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహ్మద్ అశ్రఫ్ అలీ, మండల సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు జలగం రవి, కసిరబోయిన కుమార్, మహ్మద్ ఖమురొద్దీన్ల సారథ్యంలో 20మంది గులాబీ గూటికి చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, గారె నర్సయ్య లేతాకుల రంగారెడ్డి, అయిత రాంచందర్, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, మహ్మద్ అక్బర్, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్‌యాదవ్, మైస వెంకటేశం, చందు సతీశ్‌యాదవ్, చిన్నాల ఉప్పలయ్య, ఎనగందుల యాదగిరి, అనంతుల కృష్ణారెడ్డి, బద్దం వేణుగోపాల్‌రెడ్డి, బాషబోయిన సుధాకర్, సంతోష్‌గౌడ్, కసిరబోయిన రాజుయాదవ్, బల్లెం యాదగిరి, యూసఫ్, బండారి అశోక్, ఉబ్బని సింహాద్రి, మధు, బండి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.