హైదరాబాద్/బేగంపేట్, మార్చి 6(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు వచ్చింది. కార్యాలయంలో 14 బాంబులు అమర్చామని గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్లో బెదిరించారు. వెంటనే పోలీసులు బాంబ్ డిస్పోజల్ స్కాడ్, డాగ్ స్కాడ్‌తో గాలింపు చేపట్టారు. చివరికి ఎటువంటి బాంబులు లేవని తేల్చారు. కాగా ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.