హైదరాబాద్, మార్చి 6(నమస్తే తెలంగాణ): పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ మల్లేశ్వరి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లో శుక్రవారం మృతిచెందారు. డాక్టర్ మల్లేశ్వరి సుదీర్ఘకాలం వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (వీబీఆర్ఐ)లో జాయింట్ డైరెక్టర్‌గా సేవలందించారు. ప్రస్తుతం పశుసంవర్ధకశాఖ అడిషనల్ డైరెక్టర్‌తోపాటు పశుగణాభివృద్ధి సంస్థ (టీఎస్ఎల్జీడీఏ)కు ఇంచార్జి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆమె మృతి పట్ల గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం విచారం వ్యక్తంచేసింది. జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ సంతాపం ప్రకటించారు.