బచ్చన్నపేట : జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన మమత బాయిని శుక్రవారం మండల కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ఎప్పుడు అందుబాటులో ఉండాలని, అర్హులైన వారికీ న్యాయం జరిగే విధంగా చూడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యానాధ్, మండల ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య, కొడవటూరు దేవస్థాన చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ మాసాపేట రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గుర్రపు బాలరాజు, దిడిగ రమేష్, గోలి బుచ్చిరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్, కొన్నే గ్రామ శాఖ అధ్యక్షులు సిద్ధిరాములు, ఉప్పలయ, సత్తయ్య , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.