నర్సంపేట/నల్లబెల్లి, అక్టోబర్ 9 : కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీల లాగేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మోసం చేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురు వా రం ఆయన మాట్లాడుతూ 55 ఏం డ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వే షన్ల కోసం పాటు పడిందా అని ప్రశ్నించారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంత్‌రెడ్డి గల్లీలో కొట్లాడుతు న్నారని పెద్ది ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే జాతీయ నాయకులతో అక్కడే పోరాడాలని పేర్కొన్నారు. కలిసి రావడానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు.
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చేసిన కుట్రలు పటా పంచలు అయ్యాయని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టబద్ధత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి తెలివిగా దానిని పక్కదోవ పట్టించారన్నారు. బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూమంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీశారని ఆయన ఆరోపించారు.
స్థానిక సంస్థల్లో సింగిల్ డిజిట్ డిపాజిట్లు రాకుండా ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ కాల యాపన చేస్తున్నదన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు ఆపి మీకు, మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42 శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడాలని కోరారు. పార్లమెంట్లో చట్టం చేయించి షెడ్యూల్ 9లో చేర్చాలని పెద్ది పేర్కొన్నారు.ఈ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలని, ఢిల్లీ వేదికగా యుద్ధభేరిని మోగించాలని పిలుపునిచ్చారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుందన్నారు.