నల్లబెల్లి, మే 21 : రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు నల్లబెల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించిన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, ఇస్తారి శేఖర్, ప్రధానకార్యదర్శి చార్ల శివరెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రబెల్లి రఘుపతి రావు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ చరణ్ సింగ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పురషోత్తం సురేష్, కిసాన్ సెల్ మండలం అధ్యక్షులు ఏడాకుల సంపత్ రెడ్డి, ఉపాధ్యక్షులు పెంతల కొమురరెడ్డి, మాలోత్ మోహన్, కాంగ్రెస్ నాయకులు బత్తిని మలయ్య,తేజవత్ సమయ్య నాయక్, ఇంద్రా రెడ్డి, మామిడ్ల రాజి రెడ్డి, చిట్యాల ఉపేందర్ రెడ్డి, గుండాల రాజకొంరయ్య, అజ్మీరా తిరుపతి, కోటి, రమేష్, వీరన్న నాయక్ పాల్గొన్నారు.