నస్పూర్, ఫిబ్రవరి 26 : రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాల కోసం ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండగా, హకీంపేటలో ఏప్రిల్లో తుది ఎంపిక చేపట్టనున్నారు.
దరఖాస్తు… ఎంపిక ఇలా
ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో మార్చి 13 నుంచి 17వ తేదీ వరకూ ఎంపికలు చేపడుతారు. ఇందుకోసం ఈ నెల 26 నుంచి మార్చి 4న సాయంత్రం 5 గంటల వరకూ టీజీఎస్ఎస్.తెలంగాణ.జీవోవి.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. 2017 సెప్టెంబర్ 1-2018 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులు.
ప్రతిభ కనబర్చిన వారికే..
30 మీటర్ల ప్లేయింగ్ సార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, షటిల్ రన్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలీటీ పరీక్ష, వన్కేజీ మెడిసిన్ బాల్ త్రో, 800 మీటర్ల పరుగు పందెం పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేస్తారు. ఆధార్ కార్డు, ప్రస్తుత పాఠశాలకు సంబంధించిన విద్యా ధువపత్రం, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్టు, 5 పాస్పోర్టు సైజ్ ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుంది.