నల్లబెల్లి, సెప్టెంబర్ 17 : చివరి రక్తపు బొట్టు నియోజకవర్గం అభివృద్ధికే దారపోస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలపై ఆకర్షితులై మండలంలోని లెంకాలపెల్లి, దస్తగిరిపల్లె గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌కు చెందిన 50 కుటుంబాలు ఆదివారం క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవకాశం దొరికిందన్నారు. వర్షాబావ పరిస్థితుల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు ఏ ప్రభుత్వం ఆదుకోని విధంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 32 వేల 333 మంది రైతులకు పార్టీలకతీంగా రూ.42 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. దీనిలో భాగంగా నల్లబెల్లి మండలంలోని 3018 మంది రైతులకు రూ.3.50 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
అభివృద్ధిని జీర్ణించుకోలేని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గంలో నిలువ నీడ లేకపోవడంతో చేసేదిమి లేక ఆగమ్యగోచరంగా మారి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేయడం దిక్కుమాలిన రాజకీయానికి నిదర్శనమన్నారు. రాబోవు ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్తో పాటు పార్టీలో చేరిన వారిలో దస్తగిరిపల్లె గ్రామంలో కాంగ్రెస్ వార్డు మెంబర్ పెంబర్తి మల్లమ్మ, గణిపాక సుజాత, లద్దునూరి లక్ష్మణ్, తప్పల సుభాస్, బొల్లె నవీన్, కుమ్మరి సంపత్, కుమ్మరి యాకయ్య, పెంబర్తి ప్రవీణ్, అలాగే లెంకాలపెల్లి కాంగ్రెస్ కార్యకర్తలు నత్తి లింగయ్య, కిరణ్, రాజ్‌కుమార్, ఐలయ్య, చిరంజీవి, శ్రీకాంత్, పవన్, సారయ్య, మంద ఉప్పలక్క, కన్నం నర్సయ్య, మల్లయ్య, బండి రమేశ్, వీరబోయిన శ్రీను, మూలగాని సాంబయ్య, బండి రమేశ్, రంజిత్, సురేశ్, శ్రీకాంత్, హరీశ్, అఖిల్, వెంకటేశ్, శ్రీకాంత్, ఫణీందర్తో పాటు పలువురు పార్టీలో చేరారు. కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రజాప్రతినిదులు, నాయకులు పాల్గొన్నారు.
సీఎం ప్రజారంజక పాలనకు ఆకర్షితులై 70 ముదిరాజ్ కుటుంబాలు బీఆర్ఎస్లో చేరిక
సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి అందిస్తున్న ప్రజా రంజక పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి, బొబ్బరోనిపల్లి, మల్లంపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ నాయకులు, సుమారుగా 70 కుటుంబాలు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మత్య్సశాఖ సంఘం నాయకులు ఈర్ల నరేశ్, సోడా సమ్మయ్య, పాండవుల వెంకటేశ్వర్లతో పాటు సుమారుగా 100 మంది చేరారు. దుగ్గొండి మండల పరిషత్ వైస్ ప్రసిడెంట్ జేపాల్‌రెడ్డి, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మొగిలి, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఎన్నారై రాష్ట్ర కన్వీనర్, ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ప్రతినిధి రాజకుమార్ శానబోయిన, నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో కాంగ్రెస్ నాయకుల చేరిక
చెన్నారావుపేట: మండంలోని కోనాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగిలి బాలయ్య, మహేశ్ ఆదివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు ఎమ్మెల్యే పెద్ది గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగల సత్తా కేవలం సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షడు రాజ్‌కుమార్, మల్లయ్య, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.