ఐనవోలు, అక్టోబర్ 24 : పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు శుక్రవారం పున్నేల్ క్రాస్ వద్ద ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో మాజీ వార్డుమెంబర్ చింత అశోక్, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు బరిగెల ఇసాక్, సొసైటీ మాజీ డైరెక్టర్ మొలుగూరి బాబు, కొత్తూరి జాన్సన్, చింత రఘు, కొత్తూరి కర్రె కొమురయ్య, మొలుగూరి లచ్చయ్య, చింత రాములు, మంద రాజు ఉన్నారు. కాగా, రాష్ట్రస్థాయిలో కీలకమైన పదవిలో కొనసాగుతున్న మండల కేంద్రానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత, కుటుంబసభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులకు ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నట్లు తెలిసింది.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ తంపుల మోహన్, ఇన్చార్జి పోలెపల్లి రామ్మూర్తి, మాజీ సర్పంచులు పల్లకొండ సురేశ్, ఎస్కే ఉస్మాన్అలీ, సీనియర్ నాయకులు తీగల లక్ష్మణ్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటికాయల కుమార్, ప్రధాన కార్యదర్శి కాటబోయిన అశోక్, గడ్డం రఘువంశీగౌడ్, దుపెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.