నర్సంపేట, జనవరి 23 : మాజీ కౌన్సిలర్‌పై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, ఓబీసీ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతయ్య దాడి చేసిన సంఘటన నర్సంపేట పట్టణం వడ్డెరకాలనీలో గురువారం సాయం త్రం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. 15వ వార్డు మాజీ కౌన్సిలర్ శివరాత్రి వెంకటమ్మ-స్వామి ఇంటికి వచ్చిన మున్సిపల్ అధికారులకు దంపతులిద్దరూ ఇంటి పర్మిషన్ పత్రాలను చూపించారు. దీంతో అధికారులు స్వామి ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్డు ఉందని నిర్ధారించి మార్కింగ్ చేసి అక్కడే ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్ కమలాకర్‌కు చెప్పి వెళ్లారు. వారు వెళ్లిన తర్వాత ఓబీసీ జిల్లా చైర్మన్ తిరుపతయ్య అతడి కుటుంబ సభ్యులైన ఓర్సు వెంకన్న, ఓర్సు రమేశ్, ఓర్సు అశోక్, ఓర్సు రాజు, ఓర్సు పరమేశ్ అదే రోడ్డుకు ఒక పక్కన జేసీబీతో కాలువ తీస్తూ స్వామి ఇంటి వరకు వచ్చారు.
ఇంటిముందు మున్సిపల్ అధికారులు పెట్టిన మార్కింగ్‌ను దాటి ప్రహరీని కూల్చేందుకు డ్రైవర్ ప్రయత్నించగా వెంటనే స్వామి డ్రైవర్‌కు మున్సిపల్ అధికారులు పెట్టిన హద్దుదాటి తీయవద్దు అని చెబుతుండగానే తిరుపతయ్యతో పాటు మిగతా ఐదుగురు ఓర్సు వెంకన్న, రమేశ్, అశోక్, రాజు, పరమేశ్ అకారణంగా రాళ్లతో స్వామి ఇంటిపైకి దాడి చేసి కడుపులో, ఛాతి లో, తలపై విపరీతంగా కొట్టారు. ఈ క్రమంలో స్పృహకోల్పోయిన స్వామి ని అతడి ఇంట్లో కిరాయికి ఉంటున్న రవి ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేశాడు. ఇంటిముందున్న మాజీ కౌన్సిలర్ శివరాత్రి వెంకటమ్మపై తిరుపతయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు స్థానికులు తెలిపారు. నిందితులపై స్వామి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా తిరుపతయ్య కూడా స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఎస్సై అరుణ్‌కుమార్‌ను వివరణ కోరగా ఇరువురు ఫిర్యాదులు చేశారని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
భౌతిక దాడులు సరికాదు..
కాంగ్రెస్ నాయకుడు తిరుపతయ్య, అతని కుటుంబసభ్యులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన మాజీ కౌన్సిలర్ దంపతులు శివరాత్రి వెంకటమ్మ-స్వామిని నర్సంపేట పట్టణ బీఆర్ఎస్ నాయ కులు పరామర్శించారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర మాజీ డైరెక్ట ర్ రాయిడి రవీందర్‌రెడ్డి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి వేనుముద్దల శ్రీధర్‌రెడ్డి, పట్టణ సహాయ కార్యదర్శి రావుల సతీశ్, 3వ వార్డు అధ్యక్షుడు బీరం నాగిరెడ్డి, నల్లా రవీందర్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. మున్సిపాలిటీ అనుమతులున్నా కక్ష సాధింపు చర్యలతో దాడులకు దిగడం తగదన్నారు. ఏమైనా సమస్యలుంటే చట్టపరంగా ఎదుర్కోవాలని, ఇలా భౌతికదాడులకు దిగడం మంచి పద్ధతి కాదని వారు తెలిపారు. పోలీసులు సరైన విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.