నెక్కొండ, ఆగస్టు 25 : నెలరోజులుగా రైతులు యూరియా కోసం అరిగోసపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఇలా అయితే రైతుల తిరుగుబాటు ఖాయమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నెక్కొండలో యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ కూడలిలో ధర్నా నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదే శ్లో కంటే ఘోరమైన పరిస్థితుల్లోకి తెలంగాణ రైతులు ఉన్నారని ఉన్నారు. యూరియా సమస్యను పరిష్కరించకుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరకు సీఎం పర్యటనల్లో చేదు అనుభవాలు మిగులుతా యన్నారు. గ్రామాల పొలిమేరల్లో రైతులు ఆగ్రహానికి క్యూలో ముళ్లకంపలు, చెప్పుల దండలు దర్శనమి స్తాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీలు యూరియా కొరతను సృష్టించి రైతులను మోసం చేశాయన్నారు. రైతుల దృష్టిలో ఒకరు చిన్న దొంగ, మరొకరు పెద్ద దొంగగా అభివర్ణిం చారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రైతుల కష్టాలు తీవ్రమయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య మంత్రికి మంత్రులకు ఎమ్మెల్యేలకు 12శాతం కమీషన్లపై ఉన్న చిత్తశుద్ధి రైతుల పట్ల లేదన్నారు. నానో యూరియాను బలవంతంగా రైతులకు అధిక ధరలకు అమ్ముతూ ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారన్నారు.
కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నారన్నారు. ఏనాడూ యూరియా సమస్య తెలెత్తలేదన్నారు. నియోజకవర్గంలో వేలాదిమంది రైతులు యూరియా కోసం ధర్నాలు చే స్తుంటే స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్ది స్పందించకపోవడం దారుణమన్నారు. ఇంత అసమర్థ ఎమ్మెల్యేను ఇంత వరకు చూడలేదన్నారు. ఇక ఏ ముఖం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముంగిటకు వెళ్తారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నిలబడే వ్యక్తుల జేబులు చిల్లులు పడుతాయని, చిప్ప చేతికి వస్తుందన్నారు.
ధర్నాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సంగని సూరయ్య, న్యాయవాది కొమ్ము రమేశ్‌యాదవ్, మాజీ జడ్పీటీసీ లావుడ్య సరోజన , సొసైటీ వైస్ చైర్మ న్ మెండె వెంకన్న, మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటుక సోమయ్య, మాజీ వైస్ ఎంపీపీలు దొనికెన సారంగపాణి, కర్పూరపు శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్య క్షుడు కొణిజేటి భిక్షపతి, మాజీ సర్పంచ్ మాదాసు రవి, మాజీ ఉపసర్పంచ్ దేవనబోయిన వీరభద్ర య్య, నాయకులు కారింగుల సురేశ్, ఈదునూరి యాకయ్య, బక్కి కుమారస్వామి, లింగ్యానాయక్, మాజీ సర్పంచ్ బదావత్ స్వరూప పాల్గొన్నారు.