పరకాల, ఏప్రిల్ 26 : విద్యార్థుల సమస్యల పరిషారం కోసం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాట కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్వీ నిర్వహించనున్న పోరుబాట వాల్ పోస్టర్ను ఆదివారం హనుమకొండలోని తన నివాసంలో ఆవిషరించా రు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడు తూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ పోచంపల్లి రఘుపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్చంద్ర, కాకతీయ యూనివర్సిటీ రజక సంఘం ఇన్చార్జి కోరపెల్లి రాజేశ్, బొమ్మ ఉజ్వల్, నడికూడ మండల అధ్యక్షుడు ధూరిశెట్టి రేవంత్, పరకాల రూరల్ అధ్యక్షుడు గొట్టే అజయ్, కంఠాత్మకూర్ గ్రామ అధ్యక్షుడు గుడికందుల శివ, ఐలోని అభిషేక్, గండ్రకోట పవన్ పాల్గొన్నారు.