నర్సింహులపేట/చిన్నగూడూరు, అక్టోబర్ 6 : సరిపడా యూరియా అందించడంలో కాంగ్రె స్ సర్కారు పూర్తిగా విఫలమైందని, ఈ కారణం తోనే ఆ పార్టీని రైతులు ఓడిస్తారని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. సోమవారం నర్సింహులపేట, చిన్నగూడూరు మండల కేంద్రాల్లో జరిగిన బీఆర్ఎస్ మండల విస్తృతస్థాయి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఎంపీ పీ, జడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది బడ్జెట్లో రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఆ ఊసే మరిచిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఎన్నికలు జరిపే ఉద్దేశం లేదని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంటూ బూటకపు జీవోలతో ప్రజలను మోసం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ఓట్ల కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను 420 హామీల అమలుపై బాకీ కార్డులు చూపించి నిలదీయాలని పిలుపునిచ్చారు.
మహాలక్ష్మీ పథకంలో రూ.2500 ఇవ్వలేని ప్రభుత్వం కోటి మందిని కోటీశ్వరులను చేస్తామని మాయమాటలు చెబుతున్నదని పేర్కొన్నారు. ఆయా మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు మైదం దేవేందర్, రాంసింగ్, మాజీ వైస్ ఎంపీపీ జాటోత్ దేవేందర్, రైతుబంధు సమితి మండల మాజీ కోఆర్డినేటర్ మంగపతిరావు, కేసముద్రం మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్, బీఆర్ఎస్ నాయకులు సుధీర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, గుగులోత్ రవి, నరసింహారెడ్డి, ఖాజామియా, వెంక న్న, కిషన్, నర్సయ్య, వెంకటేశ్వర్లు, రామన్న, రవీందర్‌రెడ్డి, మధు, సురేశ్, ఆయూబ్‌పాషా, ధారాసింగ్, చెన్నారెడ్డి, కొమిరెల్లి, శ్రీను, మురళి, ఉప్పలయ్య తదితరులు ఉన్నారు.