రాహుల్ రోడ్ షో అట్టర్ ఫ్లాప్
నర్సంపేటలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ శుక్రవారం నిర్వహించిన రోడ్‌షో అట్టర్ ఫ్లాప్ అయిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని సర్వాపురం 4, 5వ వార్డు, ద్వారకపేట 6, 7వ వార్డులో శనివారం ఆయన రెండో విడుత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- కాంగ్రెస్‌వి గ్యారెంటీ పథకాలు కాదు.. బడా మోసం : ఎమ్మెల్యే పెద్ది
- గులాబీమయమైన మున్సిపాలిటీలోని వార్డులు
- ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కారు
ఎమ్మెల్యే పెద్దికి మద్దతుగా నిలుస్తున్న ప్రజలునర్సంపేటరూరల్/నర్సంపేట, నవంబర్ 18: నర్సంపేటలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ శుక్రవారం నిర్వహించిన రోడ్‌షో అట్టర్ ఫ్లాప్ అయిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని సర్వాపురం 4, 5వ వార్డు, ద్వారకపేట 6, 7వ వార్డులో శనివారం ఆయన రెండో విడుత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మలు, బోనాలు, కోలాటాలు, డప్పుచప్పుళ్లతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ప్రచారంతో నర్సంపేటలోని మున్సిపల్ వార్డులన్నీ గులాబీమయమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తేనే మన రాష్ట్ర ప్రజల బతుకులు బాగుపడుతాయన్నారు. గ్యారెంటీ, వారెంటీ లేని పార్టీ కాంగ్రెస్ అని, వాళ్లవి ఆరు గ్యారెంటీలు కాదు.. ఆరు బడా మోసాలని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గ్యారెంటీ మన సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల కంటి ముందు ఉండి, ప్రతి ఇంటి ముందు చేసిన అభివృద్ధిని గుర్తించి తనకు మద్దతు తెలపాలని కోరారు. టూరిస్టుల్లా వస్తున్న కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
మెడికల్ కళాశాల నర్సంపేటకే తలమానికం
మెడికల్ కళాశాల మంజూరు నర్సంపేటకే తలమానికమని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. మరో నెల రోజుల్లో జిల్లా ఆస్పత్రి సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. అన్ని రకాల ఉచిత వైద్య పరీక్షల కోసం టీ-డయాగ్నొస్టిస్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. జిల్లా ఆస్పత్రి ఏర్పాటుతో రెండు వేల మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పేదలు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు పట్టణంలో పాకాల ఆడిటోరియం నిర్మించామని వివరించారు. గతంలో పట్టణంలో 8 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకులు మాత్రమే ఉండేవని, అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టు వల్ల 32 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించినట్లు వివరించారు. రాహుల్‌గాంధీ నర్సంపేటకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారని, ఇటీవల నర్సంపేటలో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ దద్దరిల్లిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని-కిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి, కౌన్సిలర్లు శీలం రాంబాబుగౌడ్, రామసహాయం శ్రీదేవి, మినుముల రాజు, జుర్రు రాజు, నాగిశెట్టి పద్మా ప్రసాద్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, వేణుముద్దల శ్రీధర్‌రెడ్డి, పుట్టపాక కుమారస్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాహుల్ సభ ఎందుకు పెట్టారో..?
నర్సంపేటలో రాహుల్ గాంధీ శుక్రవారం నిర్వహించిన సభలో తనకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. దీన్నిబట్టి తన పనితనం ఆయనకు తెలిసే ఇలా చేశారని భావిస్తున్నట్లు తెలిపారు. కనీసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని కూడా అడగలేదన్నారు. రాహుల్ గాంధీ షో ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో క్షీణించిందని ఎద్దేవా చేశారు. గ్రామాలు, తండాల్లో కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు లేదని స్పష్టమైందన్నారు. రాహుల్ గాంధీ సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు చెప్పలేదన్నారు. కాంగ్రెస్ గెలిస్తే నర్సంపేటకు ఏం చేస్తారో పల్లెత్తు మాట్లడలేకపోయారని విమర్శించారు. నాలుగేళ్లకు పైగా ప్రజలకు దూరంగా ఉన్న నాయకులు ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చిన కాంగ్రెస్ నాయకులను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఆయన వెంట బత్తిని శ్రీనివాస్‌గౌడ్, కంది కృష్ణచైతన్యరెడ్డి, బోళ్ల స్వామి ఉన్నారు.
ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తా
నియోజకవర్గ ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నర్సంపేటను మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మాదన్నపేటలో బీజేపీ గ్రామ అధ్యక్షుడు బొల్లేని శోభన్‌బాబు, మాజీ ఉప సర్పంచ్ గంగుల బాబు, బీజేపీ నాయకులు బొల్లేని భిక్షపతి, కేశెట్టి రవి, గంగుల రాజయ్య, బొల్లేని పాపయ్యతోపాటు మరికొంత మంది పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చాలా మంది బీఆర్ఎస్లో చేరుతున్నారని, వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, మాజీ సర్పంచ్ ఆకుతోట కుమారస్వామి, పార్టీ గ్రామ అధ్యక్షుడు పెసరి సాంబరాజ్యం, ఎంపీటీసీ ఊడ్గుల రాంబాబు, జాగృతి జిల్లా అధ్యక్షుడు తడిగొప్పుల మల్లేశం, క్లస్టర్ ఇన్చార్జీలు కడారి కుమారస్వామి, శనిగరపు జంపయ్య, దేశిని ఆనంద్, కందికొండ రాజు, మారపాక రమ, నర్సయ్య, గాదగోని రంజిత్, బొల్లేని రాజయ్య పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఓటమి తథ్యం : ఎమ్మెల్యే పెద్ది
నల్లబెల్లి: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. లెంకాలపెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెదకాసు కొమురయ్య, మహ్మద్ సర్వర్, నానెబోయిన కిరణ్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు కావాలనే బీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఉనికి కోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గన్నెబోయిన చేరాలు, ఉపసర్పంచ్ కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

