వివాహిత దారుణ హత్య
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధంమే ఈ దారుణ హత్యకు దారి తీసిందని స్థానికులు అన్నారు. వివరాలోకి వెళ్తే .. వెల్దండ మండలం కొట్ర గ్రామంలో నారుమల్ల అనూష (24) అనే మహిళ అదే గ్రామానికి చెందిన చెన్నయ్య అనే యువకుడిని గత 5 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.
- చంపి డీజిల్ పోసి నిప్పంటించిన కిరాతకుడు
- వివాహేతర సంబంధమే కారణం ?
వెల్దండ, ఆగస్టు 13 : నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధంమే ఈ దారుణ హత్యకు దారి తీసిందని స్థానికులు అన్నారు. వివరాలోకి వెళ్తే .. వెల్దండ మండలం కొట్ర గ్రామంలో నారుమల్ల అనూష (24) అనే మహిళ అదే గ్రామానికి చెందిన చెన్నయ్య అనే యువకుడిని గత 5 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అనూష కల్వకుర్తి పట్టణంలోని ఓ లేడిస్ కార్నర్లో పని చేస్తుండగా, భర్త చెన్నయ్య హోటల్లో మాస్టర్‌గా పని చేస్తున్నాడు.
బుధవారం సాయంత్రం అనూష పని ముగించుకొని కల్వకుర్తి చౌరస్తాలో నిల్చుండగా కొట్ర గ్రామానికి చెందిన శ్యాంపూరి రాములు అనే వ్యక్తి కొట్రలో దించుతానని చెప్పి తన బైక్‌పై ఎక్కించుకున్నాడు. గ్రామానికి వెళ్లకుండా దారి మళ్లించిన రాములు కొట్ర గ్రామ శివారులో అడవిలోకి తీసుకెళ్లి బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. మృతి చెందిన అనూష మృతదేహాన్ని కొట్ర గ్రామానికి చెందిన మరో వ్యక్తి సాయంతో మరో చోటుకి తీసుకెళ్లి మృతదేహంపై అప్పటికే తెచ్చి పెట్టుకున్న కట్టెలు, డీజిల్ పోసి నిప్పంటించాడు. మృతదేహం పూర్తిగా కాలి బూడిదయింది. అనంతరం వెల్దండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు విషయం చెప్పి లొంగిపోయాడు.
ఉదయం కల్వకుర్తికి పనికి వెళ్లిన అనూష రాత్రి వరకు ఇంటికి రాక పోవడంతో భర్త గాలించసాగాడు. కల్వకుర్తికి వెళ్లి ఆమె పని చేసే లేడీస్ కార్నర్లో అడగ్గా సాయంత్రం 6గంటలకే వెళ్లిందని చెప్పడంతో వెల్దండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులు అనూష భర్తతో కలిసి ఘటన స్థలానికి వెళ్లారు. అయితే రాములుకు అనూషతో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉందని కొంత కాలంగా రాములును దూరం పెట్టడాన్ని తట్టుకోలేక అనూషను పథకం ప్రకారమే హత్య చేసి ఉంటాడని స్థానికులు ఆరోపించారు. ఘటన స్థలాన్ని కల్వకుర్తి డీఎస్పీతో పాటు వెల్దండ సీఐ రఘవీర్‌రెడ్డి, ఎస్సై యుగంధర్‌రెడ్డి క్లూస్ టీం కలిసి పరిశీలించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

