నర్సంపేటరూరల్, ఆగస్టు 17 : సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్సంపేట మండలం మాధన్నపేటకు చెందిన 40 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సమక్ష్యంలో బీఆర్ఎస్లో చేరారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, 6వ వార్డు సభ్యు డు రాదారపు బుజ్జన్న, ఎస్సీ కాలనీ కుల పెద్ద మనిషి ఏ యాదగిరి, శనిగరపు వినయ్, పుట్ట సురేశ్, అఖిల్, శేఖర్, శనిగరపు సూరయ్య, ఏడెల్లి సుమన్, శ్రీరాముల ఏ కాంబ్రం, రాములు, మనోజ్, అరవింద్, ప్రకాశ్, మారపాక రమేశ్, గనిపాక రాజశేఖర్, ముక్క సురేశ్, మహ్మద్ సలీంతో పాటు మరికొంత మంది బీఆర్ఎస్లో చేరారు. కాగా, వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి ప నులు, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ఎంతో మంది బీఆర్ఎస్లోకి చేరడం రివాజుగా మారిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రజల బతుకులను కొల్లగొట్టే పార్టీలని, కేవలం బీఆర్ఎస్ బతుకునిచ్చే పార్టీ అని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేసి, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి అధికారంలోకి తీసుకురావాలన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. నర్సంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, రానున్న రోజుల్లో నర్సంపేటను మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పెసరు సాంబరాజ్యం, బీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తడిగొప్పుల మల్లేశ్, నాయకులు శనిగరపు జంపయ్య, కే కుమారస్వామి, ఎం నర్సయ్య, డీ ఆనందం, పీ విక్రం, ఏ అనిల్, పరమేశ్ పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : మండలంలోని పుల్లాయబోడు తం డాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, సొసైటీ మాజీ డైరెక్టర్, వార్డు సభ్యులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షం లో బీఆర్ఎస్లో గురువారం చేరారు. పార్టీలో చేరిన వా రికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. అ నంతరం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ కేసీఆ ర్ నాయకత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సా ధిస్తుందని బలంగా నమ్ముతున్నామన్నారు. ఎమ్మెల్యే పెద్ది కి అండగా నిలిచి నియోజకవర్గ అభివృద్ధ్దిలో భాగస్వాములవ్వాలని పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. సర్పంచ్ సమ్మునాయక్, క్లస్టర్ బాధ్యులు పాల్గొన్నారు.