పాలకుర్తి రూరల్, నవంబర్ 17 : ‘కాంగ్రెస్ పాలనలో రైతులు నానా కష్టాలు పడ్డారు.. కరెంట్ సక్రమంగా రాక పంటలకు నీరందక నష్టపోయారు.. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని టీ-పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు..’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ఎన్నికలు సమీపించడంతో రేవంత్‌రెడ్డి బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. శుక్రవారం పాలకుర్తి మండలం వావిలాల, కొండాపురం, దర్దేపల్లి, వల్మిడి, మంచుప్పుల, చెన్నూరు, విస్నూరు, దళిత కాలనీ, లక్ష్మీనారాయణపురంలో ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రోడ్డు షోలు నిర్వహించి ఇంటింటా ప్రచారం చేశారు. ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఏం జరిగింది.. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో ఏం చేసిందని ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్పడంలో మొనగాళ్లని, వారి మాటలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతు బంధు పథకం అమలు కాదని, 24 గంటల కరెంటు కాస్తా మూడు గంటలు అవుతుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామానికి 100 ఇళ్లను మంజూరు చేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఇవాళ ఇకడ.. రేపు ఎకడో తెలియని వాళ్లకు ఓటు వేయొద్దని మంత్రి ఎర్రబెల్లి ప్రజలను కోరారు. ప్రజల కోసమ పనిచేసే తాను అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా చెప్పుకునే వారికి ఈ ప్రాంతంపై కనీస అవగాహన ఉందా అని ప్రశ్నించారు. డబ్బులతో ఓటర్లను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని, ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆమెరికాకు తిరిగి వెళ్లడం ఖాయమన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి చేస్తున్న తనను, తెలంగాణ రూపురేఖలు మార్చిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించి సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని కోరారు.
రేవంత్‌రెడ్డి దగాకోరు మాటలతో తనను మోసం చేశాడని ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన ఎన్నారై ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇస్తానని చెప్పి ఝాన్సీరెడ్డికి అమ్ముకున్నాడని ఆరోపించారు. త్వరలోనే రేవంత్‌రెడ్డి నిజస్వరూపాన్ని, ఝాన్సీరెడ్డి మోసాలను ప్రజలకు వెల్లడిస్తానని చెప్పారు. అభివృద్ధి కాముకుడైన ఎర్రబెల్లి ని గెలిపించాలని ప్రజలను కోరారు. సమావేశంలో ఎం పీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్‌రావు, మండలాధ్యక్షుడు పసునూరి నవీన్ పాల్గొన్నారు.
మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ద్వారా వృత్తి నైపుణ్యాలను పెంపొందించామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇప్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం శిక్షణ అందించి జాబ్‌మేళాల్లో ఉద్యోగాలు ఇప్పించామన్నారు. వేలాది మందికి ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించినట్లు ఎర్రబెల్లి వివరించారు. కరోనా సమయంలో ప్రజల మధ్య ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి నిత్యావసర వస్తువులు అందించామని తెలిపారు.