గీసుగొండ/సంగెం, నవంబర్ 6 : కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు మోసపోయి ఓటేస్తే ప్రజ లకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి, ఆరెపల్లి, అనంతారం, మచ్చాపురం గ్రామాలు, సంగెం మండలంలోని తిమ్మాపురం, గాంధీనగర్, కొత్తగూడెం గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. గ్రామాల్లో చల్లా ఇంటింటికీ తిరుగుతూ స్థానికులను అప్యాయంగా పలకరిస్తూ ఓటు అభ్యర్థించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ.. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ సాధ్యం కాని హామీలను ఇస్తు ప్రజలను మభ్యపెడుతున్నదన్నారు. ప్రజలు ఆలోచించాలని మోసపోతే గోసపడ్తామని కాంగ్రె స్ వస్తే కరెంటు, రైతుబంధు, రైతుబీమా బంద్ అవుతాయని అ న్నారు. కాంగ్రెస్ 6 హామీలపై ఆ పార్టీ నాయకులకే నమ్మకం లేదని విమర్శించారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలకే గతిలేదు.. ఇక్కడ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 60 ఏండ్ల అభివృద్ధి జరిగిందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళలకు నెలకు రూ.3 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామన్నా రు. పరకాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ప్రజలు మళ్లీ ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొ న్నారు. దుర్మార్గ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజ లు తగిన బుద్ధి చెప్పాలన్నారు. వ్యవసాయానికి 3గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి వస్తే నిలదీయాలన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పూండ్రు జైపాల్‌రెడ్డి, వాడికారి జ్యోతి, బోడకుంట్ల ప్రకాశ్, ఎంపీటీసీ రజిత, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, కార్యదర్శి చల్లా వేణుగోపాల్‌రెడ్డి, ఎలుకుర్తి సొసైటీ చైర్మ న్ మోహన్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు రాజేశ్వర్‌రావు, బాలరాజు, క మలాకర్, వెంకటేశ్వర్లు, రాజేందర్, రాజు, చిన్న, ప్రమోద్, లెనిన్, రాజ్‌కుమార్, రాజు, ర వీందర్, ముంత రాజయ్య, చంద్రమౌళి, గడ్డమీది కుమారస్వామి, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ లింగారెడ్డి, మల్లారెడ్డి, నాగేశ్వర్రావు, బాబు, ని మ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, కందకట్ల నరహరి, మండలాధ్యక్షుడు పసునూరి సారంగపాణి, సర్పంచ్‌లు గన్ను శారదాసంపత్, వాసం రజితాసాంబయ్య, ఏకాం బ్రం వెంకటేశ్వర్రావు, సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామియాదవ్, సాగర్‌రెడ్డి పాల్గొన్నారు.